అక్షరటుడే, జుక్కల్ : అచ్చంపేట సొసైటీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నందుకు సంతోషంగా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండలం గోర్గల్ శివారులో అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను మంగళవారం ఆయన డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రైతుల సహకారంతో సొసైటీ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం రమేష్ రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట సొసైటీ అన్ని రంగాల్లో ముందుందని అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, అచ్చంపేట సొసైటీ ఛైర్మన్ నరసింహారెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి సీఈవో సంగమేశ్వర్ గౌడ్, ఏవో అమర్ ప్రసాద్, నాయకులు గుర్రపు శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, ప్రజా పండరి పాల్గొన్నారు.