అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 16ను కొట్టి వేస్తూ న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం జీవో నంబర్‌ 16 తీసుకొచ్చింది. ఈ జీవో ద్వారా దాదాపు 8వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు తాజా తీర్పుతో రెగ్యులరైజ్‌ అయిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.