అక్షరటుడే, ఎల్లారెడ్డి: యాంటీ బయాటిక్స్ అధికంగా వాడితే ఆరోగ్యానికి ప్రమాదమని లింగంపేట మండల వైద్యాధికారి హిమబిందు తెలిపారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో యాంటీ బయాటిక్స్ వాడొద్దని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తరచూ యాంటీ బయాటిక్స్ తీసుకోవడంతో ఏదైనా జబ్బు వచ్చినపుడు అవి పని చేయడం లేదన్నారు. అనవసరంగా వీటి వాడకంతో కలిగే నష్టాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.