అక్షరటుడే, కామారెడ్డి : సదాశివనగర్ మండలంలోని 16 గ్రామాల్లో పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. 34 మంది బాధితులకు రూ.9.63 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ నిధులు సామాన్య ప్రజలకు ఆర్థిక మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంగ్యా నాయక్, సీనియర్ కాంగ్రెస్ నేత ఇర్షాదుద్దీన్, పీఏసీఎస్ ఛైర్మన్లు సదాశివ రెడ్డి, గంగాధర్, కో-ఆర్డినేటర్ వడ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.