అక్షరటుడే, జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఛైర్మన్ మనోజ్ కుమార్, వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలోని మండలాలకు నిజాంసాగర్ నుంచి సాగునీరు అందేలా చూస్తామన్నారు. దీనికోసం నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య, విండో ఛైర్మన్లు శపథంరెడ్డి, సాయిరెడ్డి, నాగిరెడ్డి, నాయకులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, జంబి హనుమన్లు, ఇమ్రోస్, గుర్రపు శ్రీనివాస్, రామ్ రెడ్డి, మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు.