అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న వర్మ పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉన్న.. తనకు మరికొంత సమయం ఇవ్వాలని సంబంధిత పోలీసులకు వాట్సాప్ మెస్సేజ్ పెట్టారు. వర్మ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.