అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు బుధవారం కాంగ్రెస్ నాయకులు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు బుర్ర నారా గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జొన్నల రాజు, మండల యూత్ అధ్యక్షుడు రాజు, ఎల్లమయ్య, గోపాల్, ఫుల్ సింగ్, మోహన్ గౌడ్, అట్టెం శ్రీను, రవి, నగేష్ పాల్గొన్నారు.