అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల్లో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు. అనంతరం పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ లోని డీఆర్సీ, కంపోస్ట్ యార్డ్ లను సందర్శించారు. ఆయన వెంట సానిటరీ ఇన్‌స్పెక్టర్ గజానంద్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.