అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు మండలం కంచర్ల గ్రామానికి చెందిన సుగుణను హత్య చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ సంపత్ పేర్కొన్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. సుగుణ వ్యవసాయ భూమిలో కూరగాయలు కోస్తుండగా తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడును నిందితులు లాక్కెళ్లినట్లు వివరించారు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు.