అక్షరటుడే, వెబ్డెస్క్ : నటుడు ధనుష్, ఆయన సతీమణి ఐశ్వర్య విడాకుల కేసు విచారణలో భాగంగా తాజాగా మద్రాస్ ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుదితీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య. నటుడు ధనుష్, ఐశ్వర్యల వివాహం 2004 నవంబర్ 18న జరిగిన విషయం తెలిసిందే.