అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మూసీ నది ప్రక్షాళనపై సోషల్‌ మీడియా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘‘నదుల వెంట నాగరికత వర్ధిల్లాలి.. నదులను కబళిస్తే మనిషి మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ప్రజా ఆరోగ్యం.. పటిష్ట ఆర్థికం.. పర్యావరణ కోణాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం కావాలి.. కానీ, శాపంగా మిగలిపోకూడదు. మూసీ ప్రక్షాళన చేయాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పం ఈతరానికే కాదు.. తరతరాలకు మేలు చేసే నిర్ణయం. ఈనిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికి.. ప్రతి వ్యవస్థకి ధన్యవాదాలు’’ అని ఎక్స్‌వేదికగా సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  CLP meeting | మంత్రి పదవుల కోసం కుమ్ములాటలు.. నేడు సీఎల్పీ సమావేశం