అక్షరటుడే, కామారెడ్డి: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. ఏడాదిలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డిలో అన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని, అందుకు ప్రతి కార్యకర్త బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.