అక్షరటుడే, జుక్కల్: పిట్లం మార్కెట్ కమిటీకి చెందిన దుకాణ సముదాయాల టెండర్ కు డిపాజిట్ విషయమై ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ అధ్యక్షతన గురువారం పాలకవర్గం సమావేశమైంది. గతంలో డిపాజిట్ రూ.50 వేలు ఉండగా, ఎవరూ ముందుకు రాకపోవడంతో రూ. 25 వేలకు తగ్గించాలని చర్చించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, పాలక వర్గ సభ్యులు, సెక్రెటరీ శ్రీకాంత్ పాల్గొన్నారు.