అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : తెలంగాణ యూనివర్సిటీలో పీజీ, ఎల్‌ఎల్బీ, బీఎడ్ సీట్లను భర్తీ చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కల్యాణ్, నగరాధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో వీసీకి వినితిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో పేద మధ్యతరగతి ప్రతిభావంతులైన విద్యార్థుల విద్యావకాశాలను దూరం చేస్తున్నారన్నారు. తక్షణమే స్పాట్ వెరిఫికేషన్ పెట్టి అర్హులైన విద్యార్థులకు ఆయా కోర్సుల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అఖిల్, నగేష్, వినయ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.