అక్షరటుడే, ఇందూరు: ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీనిపై తాము కూడా చర్చకు సిద్ధమని జెడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో మేనిఫెస్టోలో లేని హామీలనూ అమలు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సిర్ప రాజు, సత్య ప్రకాష్, తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, ఫహీం ఖురేషి, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.