అక్షరటుడే, వెబ్‌డెస్క్: సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోసాని కృష్ణ మురళి రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. ఇకపై తాను రాజకీయాలు మాట్లాడనని ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదన్నారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని చెప్పారు. ‘భవిష్యత్తులో ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించను. ఒక ఓటరుగా ప్రశ్నించా.. మంచి చేసేవారికి మద్దతు ఇచ్చా’నని తెలిపారు. తన కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నానని పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు.