అక్షరటుడే, వెబ్డెస్క్: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో కీలక ఒప్పందాన్ని కెన్యా ప్రభుత్వం రద్దు చేసుకుంది. అమెరికాలో అదానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం 30 ఏళ్ల ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీని విలువ 700 మిలియన్ డాలర్లు. మిత్ర దేశాల దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది.