అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల బాట పట్టాయి. ఉదయం 194 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 839 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో ప్రారంభమై గరిష్టంగా 259 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 510 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో కదలాడుతున్నాయి. సూచిల్లో ఓలాటాలిటీ కొనసాగుతోంది. నిఫ్టీ 50లో అపోలో హాస్పిటల్స్, గ్రాసిం, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్స్యూమర్, ఎల్టీఐఎం, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, అదాని పోర్ట్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, టైటాన్ ఒక శాతానికి పైగా లాభంతో.. ఆక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, హీరో మోటార్ స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి.