అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సుమారు రెండు నెలలుగా నెట్‌ సెల్లర్లుగా నిలుస్తున్న ఎఫ్‌ఐఐలు.. కొన్ని సెక్టార్లలోని స్టాక్స్‌ మాత్రం సైలెంట్‌గా కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా ఈనెలలో ఐటీ, కన్‌స్ట్రక్షన్, కెమికల్‌, రియల్‌ ఎస్టేట్‌, హెల్త్‌ కేర్‌ రంగాల్లోని షేర్లలో పెట్టుబడులు పెట్టారు. ఐటీలో 366 మిలియన్‌ డాలర్లు, కన్‌స్ట్రక్షన్ రంగంలోని స్టాక్స్‌లో 227 మిలియన్‌ డాలర్లు, హెల్త్‌కేర్‌లో 87 మిలియన్‌ డాలర్లు, రియల్‌ ఎస్టేట్‌లో 82 మిలియన్‌ డాలర్లు, కెమికల్‌ సెక్టార్‌లో 25 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.