అక్షరటుడే, కోటగిరి: చెక్పోస్ట్ ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పొతంగల్ మండలం కొడిచర్ల శివారులో అధికారులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ ను దుండగులు కాల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.