అక్షరటుడే, ఆర్మూర్: ఇంటింటి సమగ్ర సర్వే వివరాలు ఆన్లైన్ లో ఎంట్రీ చేసే విషయంలో తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి, సర్వే వివరాల ఆన్లైన్ ఎంట్రీ తీరును పరిశీలించారు. ఎన్యూమరేటర్, సూపర్ వైజర్ల లింక్ ను జతపరుస్తూ, వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నామని ఆపరేటర్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్ తదితరులున్నారు.