కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్మూర్ కౌన్సిలర్లు

0

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. ఇటీవల ఆ పార్టీ కౌన్సిలర్స్ 15 మంది ఏకకాలంలో హస్తం గూటికి చేరారు. మంగళవారం మాజీ చైర్ పర్సన్ పండిత్ వినీత సహా మిగితా కౌన్సిలర్స్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర కో అపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో పండిత్ వినిత పవన్, మాజీ చైర్మన్ సంజయ్ సింగ్, కౌన్సిలర్లు బాదం రాజ్ కుమార్, తాటి హనుమండ్లు, ఎస్ఆర్ సుజాత రమేష్, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్, బోండ్ల సంతోష్, మాజీ సర్పంచిలు కొంగి సదాశివ్, సాయినాథ్ గౌడ్, కొట్టాల మోహన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ సర్పంచ్ జ్యోతి మారుతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాజు భాయ్, చిట్టి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఈ నెల 21న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సరిపడా సంఖ్యా బలం ఉంది. తాజా చేరికలతో మున్సిపాలిటీ చైర్మన్ పీఠం సునాయాసంగా హస్తగతం కానుంది. అయితే కొత్త చైర్మన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఇప్పటికే కౌన్సిలర్స్ క్యాంపులో ఉన్నారు.