అక్షరటుడే, కామారెడ్డి: విద్యాశాఖలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు డీఈవో రాజుకు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. 15 రోజుల్లో ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, నాయకులు రోబో శ్రీను, రాములు, శైలజ, గణేశ్, లింగం, శాంభవి, సుప్రియ పాల్గొన్నారు.