అక్షరటుడే, ఆర్మూర్‌: ఆలూరులోని కులగణన సర్వే ఆన్‌లైన్‌ డాటా ఎంట్రీ కేంద్రాన్ని తహసీల్దార్‌ రమేష్‌ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలని ఆపరేటర్లకు సూచించారు. ఆన్‌లైన్‌ చేసే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నరేందర్, కార్యదర్శులు రాజలింగం, నాజిర్, నవీన్, శ్రీనివాస్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement