అక్షరటుడే, ఇందూరు: మహిళా పొదుపు సంఘాలకు సంబంధించి డబ్బులు వసూలు చేసి బ్యాంకులో జమ చేయని సీవోలు, ఆర్పీలపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి జమున డిమాండ్ చేశారు. శనివారం పీడీకి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీనిధి మహిళా స్వయం సహాయక గ్రూపుల నుంచి డబ్బులు తీసుకుని సభ్యులకు ఓచర్లు ఇవ్వకుండా బ్యాంకులో కట్టకపోవడంతో దాదాపు 23 గ్రూపులకు లోన్లు రావడం లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల సభ్యులు ఉన్నారు.
Advertisement
Advertisement