అక్షరటుడే, బోధన్: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహాన్ని, పాఠశాలలను డిప్యూటీ డీఎంహెచ్వో సమత, ఫుడ్ సేఫ్టీ అధికారి వినీత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. రాకాసీపేటలోని మైనారిటీ బాలుర, బాలికల పాఠశాలలను తనిఖీ చేశారు. వంట సామాగ్రి, దుప్పట్లు, మరుగుదొడ్లను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఎంఈవో నాగయ్య తెలిపారు. అనంతరం మైనార్టీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి వెంట ప్రిన్సిపాల్ పద్మజ తదితరులున్నారు.