అక్షరటుడే, వెబ్ డెస్క్: పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్) కార్డు ఇకపై డిజిటల్ రూపంలో ఉండబోతోంది. పాన్ కార్డు 2.0కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ఆధునికీకరించిన డిజిటల్‌ పాన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. క్యూఆర్‌ కోడ్‌తో కొత్త కార్డులు ఉంటాయని వివరించారు. పేపర్‌లెస్‌, ఆన్‌లైన్‌ విధానంలో కొత్త పాన్‌కార్డు ఉంటుందని చెప్పారు.