అక్ష‌ర‌టుడే, పెద్ద‌ప‌ల్లి: రోడ్డు మీదే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. పెద్ద‌ప‌ల్లి ప‌ట్ట‌ణం ఎస్ఆర్‌సీ నీటి పారుద‌ల శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ న‌ర్సింగ‌రావు ఓ బిల్లు విష‌యంలో గుత్తేదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ర‌మ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో సిబ్బంది నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాల‌యంలో త‌నిఖీలు చేపట్టి రికార్డుల‌ను ప‌రిశీలించారు. జిల్లాలోని అంత‌ర్గాంలో ఇటీవ‌ల ఓ రెవెన్యూ అధికారి ప‌ట్టుబ‌డ్డాడు. వారం రోజుల లోపే మ‌రో అధికారి చిక్క‌డంతో జిల్లాలో లంచాల బాగోతం క‌ల‌క‌లం రేపుతోంది.