అక్షరటుడే, వెబ్ డెస్క్: మంత్రాల నెపంతో మహిళను హత్య చేసిన కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల శుక్రవారం తీర్పునిచ్చారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లిలో 2018లో మంత్రాల నెపంతో ఓ మహిళపై దాడిచేసి హత్య చేశారు. అనంతరం హత్యానేరం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొక్కల చిత్ర, బట్టు వెంకటేష్, పందిర్ల రాజేందర్, బట్టు రంజిత్ ను నిందితులుగా గుర్తించారు. తదుపరిగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కాగా.. నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం తుది తీర్పు వెలువడింది.