అక్షరటుడే, వెబ్ డెస్క్: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ను గురువారం ఈడీ అరెస్టు చేసి తమ కార్యాలయానికి తరలించింది. శుక్రవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన్ను హాజరుపర్చింది. పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు అక్రమమని ఆయన తరపున న్యాయవాదులు వాదించారు. వాదోపవాదనల తర్వాత ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించారు. ఈ నెల 28 వరకు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను విచారించనున్నారు. మరోవైపు ఇదే కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీలో విచారిస్తోంది. శనివారం ఆమె కస్టడీ గడువు ముగియనుంది.