అక్షరటుడే, కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 20వ వార్డులో డ్రెయినేజీ, మంచినీటి సమస్య ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. స్థానిక కౌన్సిలర్ ఛైర్ పర్సన్ దృష్టికి తెచ్చారన్నారు. వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి డ్రెయినేజీ క్లీన్ చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తయాబా సుల్తానా సలీం, కాలనీవాసులు పాల్గొన్నారు.