Advertisement

అక్షరటుడే, బాన్సువాడ: రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తనిఖీ చేశారు. వంటగది, పాఠశాల తరగతి గదులను పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, తాజా కూరగాయలతో వంట చేయాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భోజనం ఏ విధంగా పెడుతున్నారని ఆరా తీశారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. తహశీల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేష్ బాబు ఉన్నారు.

Advertisement