అక్షరటుడే, వెబ్డెస్క్: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రాంచీలోని మొరాబడి స్టేడియంలో 14వ సీఎంగా ఆయనతో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమానికి ఇండియా కూటమి ముఖ్య నేతలు హాజరుకానున్నారు.