అక్షరటుడే, ఎల్లారెడ్డి : పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేనివారికి సైకిళ్లను అందజేస్తున్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధి రమణ తెలిపారు. గురువారం క్లబ్ ఆధ్వర్యంలో గండి మాసానిపేట్ కు చెందిన కుర్మ దీపిక అనే అమ్మాయికి సైకిల్ అందించారు. కార్యక్రమంలో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.