అక్షరటుడే, కామారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినాలంటేనే విద్యార్థులు భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. భోజనానికి ఉపయోగించే బియ్యంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంలో తెల్లటి పురుగులు కనిపించడంతో టీచర్లు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా బియ్యంలో పురుగులు వచ్చింది నిజమేనన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్ కు తరలిస్తున్నట్టు తెలిపారు.