అక్షరటుడే, కోటగిరి: బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడీపీవో రాధిక అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి వివరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ మల్లయ్య, డిస్టిక్ కో-ఆర్డినేటర్ స్వప్న, అంగన్‌వాడీ సూపర్ వైజర్లు సుమలత, మణి తదితరులు పాల్గొన్నారు.