అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్లకు నిరసనగా శనివారం రాష్టంలో పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చినట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం విలేకరులతో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ యూ, ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ తో కొమురంభీం జిల్లాలో ఒక విద్యార్థిని మరణించిందని.. ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదన్నారు. వెంటనే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందేట్లు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మణికంఠ పాల్గొన్నారు.