అక్షరటుడే, ఆర్మూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కిటికీలు, బాత్రూం డోర్లు రిపేర్ చేయించుకోవాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.