అక్షరటుడే, ఆర్మూర్: ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారన్నారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షురాలు అనీష్, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యమ్మ, నాయకులు రవి, నరసక్క, పద్మ, పుష్పలత, లక్ష్మి, మనోజ్, మోహన్, శ్రీను, హరీశ్ పాల్గొన్నారు.