అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు రాష్ట్ర సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మూల వేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.