అక్షరటుడే, కామారెడ్డి: రామారెడ్డి పాఠశాలలో పురుగుల బియ్యం వార్తలపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు రోజుల క్రితం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి మండలంలో అన్ని పాఠశాలలకు వచ్చిన బియ్యంలో పురుగులు ఉన్న మాట వాస్తవేమని పేర్కొన్నారు. అయితే ఆ బియ్యాన్ని మధ్యాహ్నం భోజనానికి ఉపయోగించే ముందు క్లీన్ చేయడం జరిగిందని తెలిపారు. వండిన భోజనంలో పురుగులు రాలేదని పేర్కొన్నారు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ ప్రచారాన్ని జిల్లా విద్యాశాఖ ఖండిస్తుందని పేర్కొన్నారు. పురుగులు ఉన్న బియ్యాన్ని ఎంఈవో పరిశీలించి ఎంఎల్ఎస్ పాయింట్ కు తిరిగి పంపించి మంచి బియ్యాన్ని పాఠశాలలకు పంపించినట్లు తెలిపారు.