అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 19 జిల్లాల్లో వంద శాతం పూర్తయింది. హైదరాబాద్ లో మాత్రం కాస్త నెమ్మదిగా ఉంది. ఇప్పటి వరకు 82.4 శాతం మాత్రమే పూర్తయింది. ఇంకా 4.41 లక్షల ఇళ్లలో సమాచారం సేకరించాల్సి ఉంది. మరోవైపు సేకరించిన సమాచారాన్ని వేగవంతంగా కంప్యూటరీకరిస్తున్నారు. ఈ నెల 29వ తేదీ నాటికి 49.79 లక్షల కుటుంబాల సమాచారాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 92శాతం కంప్యూటరీకరణ పూర్తయింది.