అక్షరటుడే, వెబ్ డెస్క్: మేనేజ్‌మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసిన కేసులో చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీల రూ.5.34 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నీట్‌లో అత్యధిక మార్కులు వచ్చినవారు.. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను బ్లాక్ చేస్తున్నారంటూ వరంగల్ జిల్లా మట్వాడ ఠాణాలో కాళోజీ నారాయణరావు వర్శిటీ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో తాము పీజీ సీటు కోసం దరఖాస్తే చేసుకోలేదని విద్యార్థులు వెల్లడించారు. కొన్ని ప్రైవేటు కాలేజీలు.. కన్సల్టెంట్లు, మధ్యవర్తులతో కుమ్మక్కై విద్యార్థుల సర్టిఫికెట్లను వినియోగించి సీట్లను బ్లాక్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు చల్మెడ ఆనందరావు కళాశాలకు సంబంధించి రూ. 3.33 కోట్లు, ఎంఎన్‌ఆర్ కు చెందిన రూ. 2.01 కోట్ల మేర కళాశాలల బ్యాంకు ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్‌ను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.