అక్షరటుడే, వెబ్‌డెస్క్ : విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలోని ‘గోదారి గట్టు’ సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆకట్టుకుంటోంది.