అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ను ఏసీబీ అరెస్టు చేసింది. గండిపేట బఫర్‌జోన్‌లో నిఖేష్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చాడు. ఇతని పేరిట మూడు ఫామ్‌హౌస్‌లు, మూడు విల్లాలు, మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లు ఉన్నాయి. మియాపూర్‌లో ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు గుర్తించారు. నిఖేష్ అక్రమ ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. నిందితుడు నిఖేష్ ను ఏసీబీ అధికారులు నేడు జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు.
Advertisement
Advertisement