అక్షరటుడే, జుక్కల్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌ గ్రామంలో ఆదివారం జగన్‌ గౌడ్‌ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, 18 మెట్ల పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. దీంతో ఆ ప్రాంగణమంతా అయ్యప్ప శరణు ఘోషతో మార్మోమోగింది. కార్యక్రమంలో గురుస్వామి సంగమేశ్వర్‌ గౌడ్‌, నిజాంసాగర్‌, బాన్సువాడ, పిట్లం, ఎల్లారెడ్డి, కల్హేర్‌ మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.