అక్షరటుడే, ఇందూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పద్మశాలీలకు సముచిత స్థానం కల్పిస్తుందని నుడా ఛైర్మన్‌ కేశ వేణు పేర్కొన్నారు. ఆదివారం గాజుల్‌పేట్‌ 13తర్ప పద్మశాలి సంఘం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివారం సంఘ భవనంలో కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా ఎనుగందుల సుభాష్‌, కార్యదర్శిగా ఎనుగందుల మోహన్‌, కోశాధికారిగా అచ్చుగట్ల నారాయణ ఇతర కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు నరాల రత్నాకర్‌, జిల్లా పద్మశాలీ సంఘం గౌరవాధ్యక్షుడు యాదగిరి, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ పుల్గం హన్మాండ్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్‌, కార్యనిర్వాహక కార్యదర్శి చింతల గంగాదాస్‌, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.