కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు

0

అక్షరటుడే, ఆర్మూర్‌: ఎన్నికల హామీలను విస్మరించి రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పోరుబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భీమ్‌గల్‌ బస్టాండ్‌ ప్రాంతంలో రైతులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వరి కోతలు శరవేగంగా జరుగుతున్న సందర్భంలో పంటకు మద్దతుధర ఇవ్వడంతో పాటు క్వింటాలుకు అదనంగా రూ. 500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.