అక్షరటుడే, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం 171 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో గరిష్టంగా 400 పాయింట్ లు లాభపడింది. 31 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. గరిష్టంగా 116 పాయింట్లు పెరిగింది. అయితే ఉదయం 12 గంటల ప్రాంతంలో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ 615 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు పడిపోయాయి. కొద్దిసేపటికే తేరుకొని తిరిగి లాభాల బాట పట్టాయి. చివరికి సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 80,956 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 24,467 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. నిఫ్టీ ఫిఫ్టీ లో హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ లాభపడగా ఎయిర్ టెల్, సిప్లా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి.