అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్, డిపోను బుధవారం జిల్లా రీజినల్ మేనేజర్ జ్యోత్స్న పరిశీలించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఆమె వెంట డిప్యూటీ ఆర్ఎంలు సరస్వతి, శంకర్, ఆర్మూర్ డీఎం రవికుమార్, ఎస్టీఐ పారు, ఎంఎఫ్ గంగాకిషన్, అశోక్, ఎన్వీ రెడ్డి, ప్రసాద్ తదితరులున్నారు.